అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (08:11 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్‌లో శనివారం రాత్రి ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో పదకొండు మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. 
 
ఘటనా స్థలంలో రెండు హ్యాండ్ గన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ కాల్పులకు పాల్పడిన వారిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. పైగా, కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై తక్షణం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులకు ట్విటర్‌ ద్వారా హెచ్చరికలు చేశారు. దీంతో ఆ ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించారు.
 
గుర్తుతెలియని వ్యక్తులు, పోలీసుల ప్రకారం, డౌన్‌టౌన్ ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్ పరిసరాల్లో గుమిగూడిన జనంపై కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సౌత్ స్ట్రీట్‌లో పెద్ద జనసమూహం ఉన్న సమయంలో దుండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడని పేర్కొన్నారు. కాగా, ఇటీవలి కాలంలో వరుసగా కాల్పుల ఘటనలు జరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments