Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్ర శేఖర్ యేలేటి, గుణ్ణం గంగరాజువిడుదల చేసిన ఓ కల ఫస్ట్ సాంగ్

Advertiesment
Gaurish Yeleti, Roshini
, సోమవారం, 30 మే 2022 (18:37 IST)
Gaurish Yeleti, Roshini
ఎటిర్నిటి ఎంటర్‪టైన్‪మెంట్,  అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ హీరోహీరోయిన్లుగా దీపక్ కొలిపాక దర్శకత్వంలో లక్ష్మీ నవ్య మోతూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఓ కల’. ఈ చిత్రంఫస్ట్ సాంగ్ ని ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు సంయుక్తంగా నేడు విడుదల చేసారు. విడుదల అనంతరం  వారు మాట్లాడుతూ.. ‘‘ఓ కల మూవీ ఫస్ట్ సాంగ్ చాలా ఫ్రెష్ గా, చాలా కొత్తగా  ఉంది. ఇందులోనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. దర్శకుడు దీపక్ కొలిపాక ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని భావిస్తున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని తెలిపారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాకి  మంచి గుర్తింపుని తీసుకువచ్చిన మన దర్శకనిర్మాతలు గుణ్ణం గంగరాజు, మరియు చంద్రశేఖర్ యేలేటి గార్ల చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ విడుదలవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది.. సినిమా విషయానికి వస్తే.. ఇది చక్కని ప్రేమకథ. హీరో గౌరీశ్.. టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిగారికి బంధువు. ప్రతి సీన్ ని చక్కగా అర్థం చేసుకుని నటించాడు.  అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరిస్తున్నారు. నిర్మాతలు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. ప్రేక్షకులు మంచి ప్రేమ కథను చూసి చాలా కాలం అవుతుంది. ఆ లోటును మా చిత్రం తీరుస్తుందని ఖచ్చితంగా చెప్పగలను..’’ అని తెలిపారు. 
 
గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠాకూర్, అలీ, వైవా రాఘవ్, దేవి ప్రసాద్, శక్తి, రవితేజ(కమెడియన్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి
సంగీతం: నీలేష్ మందలపు
ఎడిటర్: సత్య గిడుటూరి
ఆర్ట్: ప్రేమ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహేష్  దత్త మోటూరు
పీఆర్వో: బి. వీరబాబు 
నిర్మాతలు: లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి 
దర్శకత్వం: దీపక్ కొలిపాక

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

9 అవర్స్ వెబ్ సిరీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది - తారకరత్న, మధు షాలినీ