Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ళ తర్వాత భర్తల చెంతకు చేరిన పాకిస్థాన్ భార్యలు

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (14:04 IST)
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కొందరు యువకులు పాకిస్థాన్ యువతులను పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహాలు మూడేళ్ళ క్రితం జరిగాయి. కానీ, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా తమ భార్యలను భర్తలు తమ వెంట తీసుకుని రాలేక పోయారు.
 
ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీరి భార్యలు సోమవారం రాత్రి అటారీ - వాఘా సరిహద్దు గుండా ఈ పాకిస్థాన్ భార్యలు భారత్‌కు వచ్చారు. 
 
రాజస్థాన్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్మేర్, జైసల్మేర్‌కు చెందిన ముగ్గురు యువకులు 2019లో పాకిస్థాన్‌ సింధ్‌ రాష్ట్రంలోని యువతులను పెళ్లాడారు. నెలరోజుల పాటు అక్కడే ఉన్నారు. 
 
అయితే, 2019లో వీరు వివాహం చేసుకున్న నెలరోజులకే పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాలు భారత సైన్యంపై దాడి చేశారు. ఈ దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చి వీరి భార్యలకు వీసాలు మంజూరు కాలేదు. 
 
ఈ క్రమంలో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చేందుకు ముగ్గురు యువకుల భార్యలకు ఇమిగ్రేషన్‌ అధికారులు వీసాలు మంజూరు చేయలేదు. దీంతో ఆ యువకులు భార్యలను అక్కడే ఉంచి స్వదేశానికి వచ్చేశారు. భార్యల వీసాల కోసం ముగ్గురు యువకులు రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. 
 
అయితా ఫలితం లేకుండా పోయింది. ఇపుడు వారి కృషి ఫలించడంతో భారత విదేశాంగ శాఖ అధికారులు చొరవ తీసుకోవడంతో పాకిస్థాన్ భార్యలు భారత్‌కు చేరుకున్నారు. దీంతో ఆ యువకుల ఆనందానికి అవధుల్లేకు పోయింది. ఫలితంగా ఈ కథ సుఖాంతమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments