Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లోరిడా పోలీసులు చేసిన తప్పుకు ఎన్నారైకు శిక్ష... ఎలా?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (12:13 IST)
కేవలం సీసీటీవీ ఫూటేజీతో ఒక వ్యక్తిపై నిందమోపి అతని జీవితానికి తీరని నష్టాన్ని మిగిల్చారు. ఓ ప్రవాస భారతీయుడి విషయంలో ఇలా జరిగింది. తాను నేరస్తుడిని కాదని ఎంత మొత్తుకున్నా వినకుండా అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. చివరికి నిజం తెలుసుకునే సరికి తన కుటుబం తీవ్రంగా నష్టపోయింది. 
 
ఫ్లోరిడాలో ఇటీవల స్పాల పేరుతో అమ్మాయిలను రప్పించి వ్యభిచార గృహాలను నడుపుతున్న పలువురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఆనేక విషయాలు బయటపడ్డాయి. ఇది చాలా పెద్ద కుంభకోణం అని రుజువైంది. అరెస్ట్ అయిన వారిలో ఎన్నారై సందీప్ పాటిల్ కూడా ఉన్నారు. 
 
ఓ స్పాలో లభించిన సీసీ టీవీ ఫూటేజీలో అతను కూడా ఉన్నాడని ఆరోపిస్తూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాను నేరం చేయలేదని ఎంత వాదించినా వినకుండా అరెస్టు చేసి జైల్లో పడేశారు. వీడియో రికార్డయిన సమయంలో తాను అక్కడ లేనని, చికాగోలో ఉన్నానని బాధితుడు మొరపెట్టుకున్నాడు. 
 
కానీ విచారణలో పోలీసులదే పొరపాటు అని తేలింది. ఫూటేజీలో ఉన్నది సందీప్ పాటిల్ కాదని నిర్ధారించారు. కానీ ఎన్నారై మాత్రం తన కుటుంబానికి భారీ నష్టం కలిగిందని తన ఇద్దరు కూతుళ్లకు తన ముఖం ఎలా చూపాలని వాపోతున్నాడు. అంతే కాకుండా వ్యభిచారం కేసులో ఇరుక్కున్న తన కూతుళ్లను ఎవరు పెళ్లి చేసుకుంటారని ఆవేదన చెందుతున్నారు. దీనికి ప్రభుత్వం పరిహారం చెల్లించక తప్పదని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments