ఫిబ్రవరిలో పరుగులు తీసిన బంగారం.. మార్చిలో తగ్గిపోయాయ్..

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (12:07 IST)
ఫిబ్రవరి నెలలో పరుగులు తీసిన బంగారం, వెండి ధరలు మార్చి నెలారంభం నుండి తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే బుధవారం కూడా బంగారం ధర తగ్గి, దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల పసిడి ధర రూ.33,430కి క్షీణించింది. గత వారం రోజుల నుండి పసిడి ధరలలో తగ్గుల ప్రారంభమై బుధవారానికి రూ.1,220 తగ్గింది.


డిమాండ్ తగ్గడమే ఈ పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక వెండి ధరలు మాత్రం బంగారం ధరలతో సంబంధం లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.39,500 ధర పలుకుతోంది. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 1,286.95 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 15.12 డాలర్లకు చేరింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,675, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,460గా ఉంది. చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,030, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,810గా ఉంది. ఇలాగే కొనసాగితే బంగారు ఆభరణాలు కొనాలనుకునేవారికి ఇంతకంటే శుభవార్త ఉండదని సంబరపడిపోతున్నారు ప్రజలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bobby and Krish :: హృతిక్ రోషన్ తో దర్శకుడు బాబీ - కొత్తవారితో క్రిష్ చిత్రం ?

Sanjay Dutt: స్కేల్.. టెన్షన్.. డెడ్లీ యాక్షన్ గా ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్

Varalakshmi : సరస్వతి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది: వరలక్ష్మి శరత్ కుమార్

Keeravani: విక్రమ్ ఆన్ డ్యూటీ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది : ఎంఎం కీరవాణి

Sushmita Konidela: స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

తర్వాతి కథనం
Show comments