కోమాలో ఉత్తర కొరియా చీఫ్ కిమ్‌.. అధ్యక్ష బాధ్యతలు ఆమెకేనా?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (10:53 IST)
Kim Jong Un
ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్‌కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కిమ్ జోంగ్ కోమాలోకి వెళ్లిపోయారంటూ దక్షిణ కొరియా అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

ఆయన కోమాలో ఉండడంతో ఉత్తర కొరియాలో ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి కిమ్ యో జోంగ్ చూస్తున్నారని గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్‌కు సహాయకుడిగా పనిచేసిన చాంగ్ సాంగ్ మిన్ తెలిపారు. కిమ్ కోమాలోకి వెళ్లిన విషయాన్ని తమ గూఢచర్య వర్గాలు తెలిపాయని పేర్కొన్నారు. 
 
కిమ్ కోమాలో ఉన్నట్టు తెలుస్తోందని, కానీ ఆయన మరణించలేదని చాంగ్ తెలిపారు. ఈ ఏడాది కిమ్ బయట చాలా తక్కువసార్లు కనిపించారని, ఆయన ఆరోగ్యం క్షీణించిందన్నారు.

ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిమ్ యో జోంగ్ సిద్ధంగా ఉన్నట్టు చాంగ్ పేర్కొన్నారు. కాగా, కిమ్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్టు గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత కిమ్ ఓసారి బహిరంగంగా కనిపించడంతో ఆ వార్తలకు చెక్ పడిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments