Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కోవిడ్ విజృంభణ.. 24 గంటల్లో 36,282 కేసులు

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (10:47 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకీ 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో గతంలో కేసుల తీవ్రత తగ్గినా మళ్లీ కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,842 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇంకా ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,091కి చేరింది. మృతుల సంఖ్య 761కి పెరిగింది. 
 
తెలంగాణలో గత 24 గంటల్లో 36,282 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని, దాంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,68,121కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో వ్యాధి నిర్దారణ పరీక్షలు పెరుగుతూనే వున్నాయి.

లక్షణాలున్నవారు సమీపంలోని బస్తీ దవాఖానాల్లో సమాచారం ఇస్తే పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. లక్షణాలున్న టెస్టులు చేయించుకోకుండా బయట తిరిగితే మిగిలినవారికి వ్యాధి సోకే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments