Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరబ్బాయిలతో ఇద్దరమ్మాయిల ప్రేమకథ : తండ్రికి తెలిసి ఆత్మహత్య

Advertiesment
ఇద్దరబ్బాయిలతో ఇద్దరమ్మాయిల ప్రేమకథ : తండ్రికి తెలిసి ఆత్మహత్య
, బుధవారం, 12 ఆగస్టు 2020 (13:54 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సియోని జిల్లాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదే గ్రామానికి చెందిన ఇద్దరు అబ్బాయిలతో ప్రేమలోపడ్డారు. ఈ ప్రేమ వ్యవహారం అమ్మాయిల తండ్రికి తెలిసింది. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌ సియోని జిల్లాలోని కొంద్రా గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఒకరి వయసు 18.. మరొకరి వయసు 16. వారిద్దరు ఇద్దరు యువకులతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వారిలో ఒకమ్మాయి ప్రేమికుడు ఆమె తండ్రికి తాజాగా ఓ మెసేజ్‌ పంపి, తాను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. 
 
దీంతో తమ కూతుళ్ల ప్రేమ వ్యవహారం గురించి ఆ తండ్రికి తెలిసిపోయింది.. వారిద్దరిని పెద్దలు మందలించారు. తాము అబ్బాయిలను ప్రేమిస్తున్న విషయం ఇంట్లో తెలిసిపోవడంతో ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, ఓ బావి వద్దకు వెళ్లి అందులో దూకారు. 
 
బావిలో వారు దూకిన విషయాన్ని తెలుసుకున్న ఆ అక్కాచెల్లెళ్ల కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, మృతదేహాలను బావిలోంచి బయటకు తీశారు. అమ్మాయి తండ్రికి మేసేజ్‌ పంపిన ప్రేమికుడి‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకున్నామని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రారా బుజ్జీ... చేపలకూర తీసుకెళ్దువుగాని, అతడు రాగానే తలుపేసేసింది, ఆపై?