వామ్మో.. అంత ఆహారం వృధా అవుతుందా...

ఠాగూర్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (11:58 IST)
ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతుండగా 63 టన్నుల ఆహారం చెత్తకుప్పలపాలవుతున్నట్టు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమ నివేదిక స్పష్టం చేసింది. ఈ ఆహారంలో సింహ భాగం గృహాల నుంచే వస్తోందని ఈ నివేదిక బహిర్గతం చేసింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా వృథా అవుతున్న ఆహారంలో దాదాపు 60 శాతం గృహాల నుంచే జరుగుతోందని ప్రతి వ్యక్తి యేడాదికి సగటున 79 కిలోల ఆహారాన్ని నేలపాలు చేస్తున్నారని నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ 29న అంతర్జాతీయ ఆహార నష్టం మరియు వృథా అవగాహన దినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో ఈ వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
 
యూఎన్‌పీ 2024 ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 కోట్ల టన్నులకు పైగా ఆహారం వృథా అవుతోంది. ఇందులో గృహాల నుంచి ఏకంగా 63.1 కోట్ల టన్నుల ఆహారం చెత్తకుప్పలకు చేరుతోంది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ఫుడ్ సర్వీస్ రంగం నుంచి 29 కోట్ల టన్నులు, రిటైల్ దుకాణాల నుంచి 13.1 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు నివేదిక అంచనా వేసింది.
 
ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మందికి పైగా ప్రజలు ఆహార అభద్రతతో సతమతమవుతుండగా, మరోవైపు ఇంత భారీ స్థాయిలో ఆహారం వృథా కావడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ప్రపంచ జనాభా 2050 నాటికి 970 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో, ఆహార వృథాను అరికట్టడం మానవాళి ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా నిలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

Mohanlal: వృష‌భ‌ తో థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ మోహ‌న్ లాల్

Ari movie review : అరిషడ్వర్గాల నేపథ్యంగా అరి చిత్రం రివ్యూ

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments