Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

OperationSindoor: గేమ్స్ ఫీల్డ్‌లో ఆపరేషన్ సింధూర్.. ఫలితం ఎక్కడైనా మారదు.. ప్రధాని

Advertiesment
Modi

సెల్వి

, సోమవారం, 29 సెప్టెంబరు 2025 (07:59 IST)
Modi
దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. 147 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలుపొందింది. 
 
ఫలితంగా ఆసియా కప్ విజేతగా భారత్ ఆవిర్భవించింది. దీంతో దేశ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత జట్టును అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇక పాకిస్థాన్‌పై భారత్ సాధించిన గెలుపుపై ప్రధాని మోదీ స్పందించారు. భారత జట్టుకు అభినందనలు తెలిపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.
 
క్రీడా మైదానంలో భారత జట్టు చూపిన అద్భుత ప్రదర్శనను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "గేమ్స్ ఫీల్డ్‌లో ఆపరేషన్ సింధూర్.. ఎక్కడైనా ఫలితం మాత్రం మారదు. భారతే గెలుస్తుంది" అని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.
 
సాధారణంగా భారత జట్టు కీలక విజయాలు నమోదు చేసినప్పుడు ప్రధాని మోదీ అభినందనలు తెలుపుతుంటారు. అది చాలా కామన్. ఈసారి కొంత భిన్నంగా భారత విజయాన్ని ఆపరేషన్ సిందూర్‌తో పోల్చుతూ ప్రధాని మోదీ విషెస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Aeroplane Celebration: రవూఫ్‌కు కౌంటరిచ్చిన బుమ్రా.. డిప్పింగ్ ఫ్లైట్ సంబరాలు.. వీడియో వైరల్ (video)