Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ ప్రధాని కేజీ శర్మ ఓలిపై బహిష్కరణ వేటు!

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (07:44 IST)
నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిపై బహిష్కరణ వేటు పడింది. ఆ దేశంలో అధికారంలో ఉన్న నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్.సి.పి) సంచలన నిర్ణయం తీసుకుని ఓలిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్‌కాజీ శ్రేష్ఠ ఆదివారం ప్రకటించారు. 
 
గత నెల 20న పార్లమెంటును రద్దు చేసిన ప్రధాని ఓలి.. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయంతో పుష్పకమల్ దహల్, ఓలి వర్గాలుగా పార్టీ చీలిపోయింది. ప్రధాని నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న దహల్ వర్గం ఆదివారం సమావేశమైంది. 
 
అనంతరం ఓలిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓలి ప్రత్యర్థి వర్గ నేత మాధవ్ కుమార్ నేపాల్ మాట్లాడుతూ.. అధికార ఎన్‌సీపీ ఛైర్మన్ పదవి నుంచి ఓలిని తొలగించినట్టు చెప్పారు.
 
ఆయనిక పార్టీలో సభ్యుడు కాదు కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని తన తప్పును తెలుసుకుని సరిదిద్దినా ఆయనతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కాగా, రెండుగా చీలిపోయిన కమ్యూనిస్ట్ పార్టీపై పూర్తి హక్కు తమకే ఉంటుందని ఇరు వర్గాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.
 
కాగా, కేపీ శర్మ ఓలి ఇటీవలి కాలంలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారు కూడా. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ చైనాతో కలిసి నేపాల్ దేశ సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నించారు. ఇందులోభాగంగా, నేపాల్ సరికొత్త మ్యాప్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భారత్‌కు చెందిన పలు ప్రాంతాలను నేపాల్‌కు సొంతమైనవిగా ప్రకటించారు. ఇది ఇరు దేశాల మధ్య పెద్ద దుమారమే చెలరేగిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments