Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో చట్టం - రాజ్యాంగం అనేవి ఎక్కడున్నాయి : నవాజ్ షరీఫ్ ప్రశ్న

పాకిస్థాన్ దేశంలో ఉన్న చట్టం, రాజ్యాంగం అనేవి ఎక్కడున్నాయనీ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రశ్నించారు. పనామా స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (15:30 IST)
పాకిస్థాన్ దేశంలో ఉన్న చట్టం, రాజ్యాంగం అనేవి ఎక్కడున్నాయనీ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రశ్నించారు. పనామా స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.
 
ఈ కేసు ఇస్లామాబాద్‌లోని ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌పై మండిపడ్డారు. దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న ముషారఫ్‌కు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. అరెస్ట్ నుంచి ముషారఫ్‌కు సుప్రీంకోర్టు మినహాయింపును ఇవ్వడంపై అసహనం వ్యక్తంచేశాడు. పాకిస్థాన్ లో చట్టం, రాజ్యాంగం అనేవి ఎక్కడున్నాయని అన్నారు. ముషారఫ్‌పై కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
 
అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను పరామర్శించి వచ్చేందుకు తనకు మూడు రోజల మినహాయింపును కూడా ఇవ్వలేదని కానీ, ఈనెల 13న విచారణకు హాజరుకానున్న సందర్భంగా ముషారఫ్‌ను అరెస్ట్ చేయరాదంటూ పాక్ సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. దీన్నిబట్టి చూస్తే పాకిస్థాన్‌లో ఎక్కడా చట్టాలు అమలుకావడం లేదని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments