Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ తరహాలో మోడీ హత్యకు భారీ కుట్ర.. ప్లాన్ ఎవరిదంటే?

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు పక్కా పథకం ప్రకారం హత్య చేశారు. ఇలాంటి ప్లాన్ ప్రకారమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం హత్య చేయాలని మావోయిస్టులు వ్యూహం రచిస్తున్నారని తాజాగా వెల్లడైం

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (14:54 IST)
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు పక్కా పథకం ప్రకారం హత్య చేశారు. ఇలాంటి ప్లాన్ ప్రకారమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం హత్య చేయాలని మావోయిస్టులు వ్యూహం రచిస్తున్నారని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని పూణే పోలీసులు వెల్లడించారు. అందుకు సంబంధించిన ఓ లేఖను శుక్రవారం విడుదల చేశారు. మోడీ హత్యకు కుట్ర పన్నడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మావోయిస్టులు ఆ లేఖను గతేడాది ఏప్రిల్‌లో రాశారు.
 
ఈ యేడాది జనవరి మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్‌ దావలే, సురేంద్ర గాట్లింగ్‌, సోమా సేన్‌, మహేష్‌ రౌత్‌, రోనా జాకబ్‌ విల్సన్‌ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే జాకబ్‌ విల్సన్‌ను అరెస్ట్‌ చేసిన ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. మోడీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం లేఖలో స్పష్టంగా ఉంది.
 
ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ ఐసిస్‌ గత మే నెలలో కుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. ఐసిస్‌ ఉగ్రకుట్రను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) భగ్నం చేసింది. స్నిప్పర్‌ రైఫిల్‌తో మోడీ కాల్చి హత్యచేయాలని మిలిటెంట్లు భావించారని ఏటీఎస్‌ బృందం ఇటీవల వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments