అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి ఆరోగ్య వార్త ఇపుడు చర్చనీయాశంగా మారింది. ముఖ్యంగా, ఈ ఇద్దరు వ్యోమగాములకు సంబంధించిన ఓ ఫోటో మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలను నిశితంగా పరిశీలిస్తే, సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్టు, నీరసంగా ఉన్నట్టు కనిపిస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారు.
ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లనే ఆమె బలహీనమంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో సునీతా విలియన్స్ ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని వచ్చిన వార్తలపై కూడా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా స్పందించింది.
Sunitha Williams
సునీతా విలియమ్స్ సహా వ్యోమగాములందరూ పూర్తిగా ఆకరోగ్యంతో ఉన్నారని నాసా వెల్లడించింది. వ్యోమగాములకు ఎప్పటికపుడు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, ఫ్లైట్ సర్జన్లు పర్యవేక్షిస్తున్నారని వివరించింది.
సునీత పోషకాహార లోపంతో బాధపడుతోందని అందుకే ఆమె బలహీనంగా కనిపిస్తోందని శ్వాసకోశ వ్యాధుల్లో అమెరికా నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా తెలిపారు. వ్యోమగాములు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు కనీసం 2.5 గంటలు వ్యాయామం చేయాలని సూచించారు. అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపే వారికి రక్తహీనత వచ్చే అవకాశం ఉందని చెప్పారు.