Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వామ్‌హోల్‌ కాన్సెప్ట్‌ తో రహస్యం ఇదం జగత్‌ చిత్రం : దర్శకుడు చందు మొండేటి

Sravanti Pattipati, Manasa Veena,  Chandu Mondeti, Komal R Bharadwaj

డీవీ

, మంగళవారం, 29 అక్టోబరు 2024 (17:48 IST)
Sravanti Pattipati, Manasa Veena, Chandu Mondeti, Komal R Bharadwaj
సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న రహస్యం ఇదం జగత్‌ చిత్రంలో పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వున్నాయని ఈ చిత్రం ప్రమోషన్‌ కంటెంట్‌ చూస్తే అర్థమవుతోంది.  మన పురాణాలు, ఇతిహాసాల గురించి... శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. తాజాగా ఈచిత్రం ట్రైలర్‌ను మంగళవారం కార్తికేయ-2 చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న సన్సేషనల్ దర్శకుడు చందు మొండేటి విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా చందు మొండేటి మాట్లాడుతూ ''ఈ టీజర్‌ చూసి ఎగ్జైట్‌  ఫీలయ్యాను. పర్టిక్యులర్‌గా, పర్సనల్‌గా నేను వేటికి అయితే ఎక్కువగా ఎగ్జైట్‌అవుతానో,   కనెక్ట్‌ అవుతానో.. చదువుతానో, రిసెర్చ్‌ చేస్తానో..  వాటికి సిమిలర్‌గా ఈ సినిమా కాన్సెప్ట్‌ వుండటంతో  ఎగ్జైట్‌ అయ్యాను. పర్టిక్యులర్‌ ఈ వామ్‌హోల్‌ కాన్సెప్ట్‌ గురించి చెప్పాలంటే.. 2014లో మిస్‌ అయిన ఓ ఫ్లైట్‌ శకలాలు కూడా మిగలలేదు.  శకలాలు కూడా దొరకలేదు. టెక్నాలజీ ఇంత డెవలప్‌ అయిన టైమ్‌లో ఇలా జరగడం పట్ల  నేను డీప్‌గా పరిశోధించినప్పుడు  వామ్‌హోల్‌ అనే  కాన్సెప్ట్‌ కనపడింది. అది బిలివబుల్‌గా లేదు.. అనిపించినప్పుడు  దీనికి పురాణాలు, హనుమంతుడు. స్కంద పురాణం, నారథుడు.. ఆ రెండింటిని బ్యాలెన్స్‌ చేస్తూ వస్తే అమోజింగ్‌గా కనపడింది. మన పురాతన ధర్మానికి ఇది రిలేటెడ్‌గా అనిపించింది. ఈ సినిమా తీయడం చాలా కష్టం.  ఐ థింగ్‌ సో... ఎనీ థింగ్‌ రిలేటెడ్‌ సైన్స్‌.. జనాల్లో ఇలాంటి సినిమాలు చూసే మూడ్‌లో వున్నారు. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. అందరికి ఆల్‌ ది బెస్ట్‌' అన్నారు.
 
దర్శకుడు కోమల్‌ ఆర్‌.భరద్వాజ్‌ మాట్లాడుతూ, నాకు  కార్తికేయ ఇన్‌స్పిరేషన్‌. ఇండియన్‌ హిస్టరిని ఆ సినిమా ద్వారా అందరి చాటి చెప్పాడు చందు గారు. ఆయన ప్రేరణతో ఈ సినిమా రూపొందించాను. ఈ సినిమా  ఓన్లీ మైథాలజీ కాదు.. రాముడు, హనుమంతుడేకేనా మనకు కూడా జరుగుతుందా అని వేసే ఓ చిన్న పిల్ల ప్రశ్నకు  సమాధానంగా వుంటుంది. అందరికి గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది.  సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలాజికల్‌ అంశాలు జోడించి నేటి తరం ప్రేక్షకులను మెప్పు పొందే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం.   తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్‌ వుండే విజువల్స్‌ కూడా ఈ చిత్రంలో వుంటాయి. . కల్కి, హనుమాన్‌, కార్తికేయలా ఇది మైథలాజికిల్‌ సినిమా. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ద్వారా  మన పురాణాల గురించి, మన మూలాల గురించి ఓ కొత్త విషయాన్ని చెప్పబోతున్నాం. తప్పకుండా ఈ చిత్రం అందరిన్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి సర్‌ఫ్రైజ్‌ చేస్తుందనే నమ్మకం వుంది' అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ స్రవంతి పత్తిపాటి, మానస వీణ, సంగీత దర్శకుడు గ్యానీ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాఘవ లారెన్స్ బుల్లెట్ బండి టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్