Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాలో ఘోరం.. కన్నకొడుకును చంపేసింది.. 70 ముక్కలు చేసి..?

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (15:26 IST)
రష్యాలో ఘోరం జరిగింది. కన్నకొడుకును ఓ తల్లి కిరాతకంగా చంపేసింది. ఇంకా ముక్కలు ముక్కలుగా నరికేసింది. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన లుయిట్‌మిలా అనే మహిళ కొన్ని రోజుల క్రితం తన చేతిలో ఓ బ్యాగుతో ఓ కాల్ టాక్సీ కోసం వేచి వుంది. ఆ బ్యాగు నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని లుయిట్‌మిలా చేతిలోని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో నరికిన స్థితిలో చేతులు, కాళ్లు ఇతరత్రా అవయవాలు వుండటాన్ని చూసి షాక్ అయ్యారు. అనంతరం లుయిట్‍‌మిలాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె వద్ద విచారణ జరిపారు. విచారణలో తన కుమారుడిని తాను చంపేసినట్లు ఒప్పుకుంది. 
 
తన కుమారుడిని వదిలి అతని భార్య విడిపోయిందని, అప్పటి నుంచి తాగి తనను వేధించేవాడని.. అతని చిత్ర హింసలు రోజు రోజుకీ పెరిగిపోవడంతో కన్నకొడుకునే చంపేశానని వెల్లడించింది. కుకింగ్ పాన్‌తో అతని తలపై బలంగా కొట్టి చంపేశానని.. ఆ తర్వాత అతడి అవయవాలను 70 భాగాలుగా నరికి బ్యాగులో కుక్కి చెత్తకుండీలో పారేద్దామనుకునేందుకే రోడ్డుపైకి వచ్చాను. కానీ చిక్కుకుపోయానని వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం ఆమెను జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments