Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అధ్యాపకుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలను వాట్సాప్‌లో పెట్టాలని?

Advertiesment
Hyderabad
కామాంధులు ఎక్కడపడితే అక్కడ విరుచుకుపడుతున్నారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన డిగ్రీ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేశాడో టీచర్. ఈ వేధింపులు రెచ్చిపోవడంతో బాధితురాలు షీటీమ్‌ను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మల్కాజ్‌గిరి సాయినాథ్‌పురానికి చెందిన విద్యార్థిని ఈసీఐఎల్‌లోని మహిళా డిగ్రీ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న కుషాయిగూడకు చెందిన బి. సాగర్ రెండు నెలలుగా ఆ విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
 
వాట్సాప్‌లో ఆ విద్యార్థినికి అభ్యంతరకర మెసేజ్‌లు పంపుతున్నాడు. ప్రైవేట్ ఫోటోలను కూడా వాట్సాప్‌లో పెట్టాలని బలవంతం చేసేవాడు. ఈ వేధింపులు పెచ్చరిల్లడంతో బాధిత విద్యార్థిని షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫీజ్ కట్టలేదని.. లేటుగా వచ్చారని, హోమ్ వర్క్ చేయలేదని.. నగ్నంగా నిలబెట్టారు..