మరికొన్ని దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్

Webdunia
ఆదివారం, 22 మే 2022 (14:40 IST)
ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న మంకీపాక్స్ వైరస్ ఇపుడు మరికొన్ని దేశాలకు వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్‌, స్విట్జర్లాండ్‌ దేశాల్లో వెలుగు చూసింది. తొలికేసు నమోదైనట్లు ఆయా దేశాల ఆరోగ్యశాఖలు ప్రకటించాయి. 
 
విదేశాల నుంచి తిరిగొచ్చిన వ్యక్తిలో లక్షణాలు గుర్తించి పరీక్షలు చేయగా.. మంకీపాక్స్‌గా తేలినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ప్రస్తుతం రాజధాని తెల్‌ అవీవ్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పేర్కొంది. 
 
ఇతర దేశాల నుంచి తిరిగొస్తున్న వారిలో జ్వరం, చిన్న చిన్న గాయాల వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. మంకీపాక్స్‌గా అనుమానిస్తున్న ఇతర కేసుల్ని కూడా పరీక్షిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ఇంకోవైపు, స్విట్జర్లాండ్‌లో బాధితుడి కాంటాక్ట్‌లోకి వచ్చిన వ్యక్తులందరినీ పరీక్షిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. మధ్యప్రాచ్య దేశాల్లో ఇజ్రాయెల్‌లోనే తొలికేసు నమోదైంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80 కేసుల్ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 
 
కాగా, ఇప్పటికే బ్రిటన్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీ, అమెరికా, స్వీడన్‌, కెనడా, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియాలోనూ కొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో చాలా మంది ఇటీవల ఆఫ్రికాకు ప్రయాణించిన దాఖలాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments