Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ ధర తగ్గింపు .. ట్విస్ట్ పెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

Webdunia
ఆదివారం, 22 మే 2022 (14:11 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పనిలోపనిగా వంట గ్యాస్ సిలిండరుపై రూ.200 మేరకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, ఇక్కడో మెలిక పెట్టారు. 
 
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ల పొందిన గృహ వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది. అంటే ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు పొందారు. ఈ లబ్ధిదారులకు మాత్రమే వంట గ్యాస్ ధరలో రూ.200 తగ్గనుంది. 
 
ఈ తగ్గింపుతో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.803కు దిగిరానుంది. ఈ 9 కోట్ల మంది లబ్ధితారుల గ్యాస్ సిలిండరుకు రూ.200 చొప్పున రాయితీని కేంద్రం అందిస్తుందని తెలిపారు. ఈ సబ్సీబీ 12 ఎల్పీజీ సిలిండర్ల వరకు ఉంటుందని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ధర తగ్గింపుతో కేంద్ర ఖజానాపై రూ.6100 కోట్ల భారం పడుతుందని ఆమె గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments