Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sudiksha Konanki: సుధీక్ష కొనంకీకి ఏమైంది..? మరణించిందా? ఆ లేఖ ఆమె ఫ్యామిలీ పంపిందా?

సెల్వి
మంగళవారం, 18 మార్చి 2025 (12:12 IST)
Sudiksha Konanki
తప్పిపోయిన 20 ఏళ్ల భారతీయ విద్యార్థి సుధీక్ష కొనంకీ కుటుంబం డొమినికన్ రిపబ్లిక్‌లోని పోలీసులను తన చనిపోయినట్లు ప్రకటించాలని కోరినట్లు అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి. దీనిపై డొమినికన్ రిపబ్లిక్ జాతీయ పోలీసు ప్రతినిధి డియెగో పెస్క్‌క్వీరా మాట్లాడుతూ, ఎంఎస్ కోనంకీ కుటుంబం మరణ ప్రకటనను కోరుతూ ఏజెన్సీకి ఒక లేఖ పంపినట్లు ఓ న్యూస్ ఛానల్ మంగళవారం నివేదించిందని చెప్పారు. మార్చి 6 తెల్లవారుజామున సుధిక్ష కోనంకి కనిపించకుండా పోయింది. అమెరికా పిట్స్ బర్గ్ యూనివర్సిటీలో చదువుతూ.. డొమినికన్‌ రిపబ్లిక్‌లో మిస్సైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి కేసు మిస్టరీగా మారింది.
 
సుదీక్ష చివరిసారిగా కనిపించిన ప్యూంటా కానా బీచ్‌ దగ్గర ఆమె దుస్తులను అధికారులు గుర్తించారు. బీచ్‌ దగ్గరున్న లాంజ్ చైర్‌పై తెల్లటి నెటెడ్‌ సరోంగ్‌తో పాటు ఆమె ధరించిన పాదరక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత సంతతికి చెందిన యువతి తన దుస్తులను లాంజ్ చైర్‌పై వదిలివేసి, ఆపై గోధుమ రంగు బికినీలో సముద్రంలోకి దూకి, మునిగిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
 
మార్చి 6న స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్‌ బీచ్‌ దగ్గర చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత ఆమె గదికి తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. సుదీక్ష.. ఐయోవాకు చెందిన 24 ఏళ్ల టూరిస్టు జాషువా స్టీవెన్‌ రిబెతో కలిసి బీచ్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. 
 
దీంతో అతడిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. తమ కుమార్తెను ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారని సుదీక్ష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments