Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేగి తుఫాను బీభత్సం - 25 మంది మృతి

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (12:18 IST)
ఫిలిప్పీన్స్‌లో మేగి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ బీభత్సం దెబ్బకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపుగా 25 మంది చనిపోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ తుఫాను కారణంగా తూర్పు, దక్షిణ తీరాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మేగి తుఫాను ప్రభావం కారణంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌లో ప్రతి యేడాది కనీసం 20 ఉష్ణ తుఫాన్లు వస్తుంటాయి. 
 
తూర్పు తీరంపై మేగి తుఫాను విరుచుకుపడటంతో సుమారు 13 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. భారీ వర్షాలు, గాలులు వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ వరదల కారణంగా అనేక గృహాలు నీట మునిగాయి. కొండ చరియలు విరిగిపడటం వల్ల అనేక గ్రామాల్లోకి బురదమట్టి వచ్చి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments