ఫిలిఫిన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే అరెస్టు చేస్తామని రోడ్రిగో డ్యుటర్టే వ్యాఖ్యానించారు. ఒక వేళ వ్యాక్సిన్ తీసుకునే ఉద్దేశం లేకపోతే.. దేశాన్ని విడిచి ఇండియాకో, అమెరికాకో వెళ్లిపోండి అని ఆయన అన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తోందన్నారు.
ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే వారిని తప్పకుండా అరెస్టు చేయాల్సి వస్తుందన్నారు. అప్పుడే తానే స్వయంగా వ్యాక్సిన్ ఇస్తానని చెప్పారు. అనవసరంగా తన దాకా వ్యాక్సినేషన్ ప్రక్రియను తీసుకురావొద్దని హెచ్చరించారు.
తాను ఇలా మాట్లాడటం తప్పు అనుకోవద్దని వ్యాక్సినేషన్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తోంది. మీరు ఒక వేళ వ్యాక్సిన్ తీసుకోకపోతే.. తప్పకుండా అరెస్టు చేయాల్సి వస్తుందన్నారు.