Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రానికి కేసీఆర్ సవాల్.. 24 గంటలే టైమ్.. తాడో పేడో తేల్చుకుంటాం..

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (11:56 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి సవాలు విసిరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని.. లేకుంటే కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని కేసీఆర్ అన్నారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్దంగా ఉన్నారని... రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు.  
 
కాగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు సీఎం కేసీఆర్, రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..  తెలంగాణ నుంచి ఇంత దూరం వచ్చి దీక్ష చేయడానికి కారణమెవరని కేసీఆర్ ప్రశ్నించారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చని.. కానీ రైతులతో పడొద్దని అన్నారు. కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు ఉందన్నారు. 
 
రైతుల్ని కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఉరికేపోదని అన్నారు. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని అన్నారు. 
 
కేంద్ర మంత్రి తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరమైనవని కేసీఆర్ అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలు నూకలు తినాలని చెప్పారని.. తాము మేము పీయూష్ గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా..? అని ప్రశ్నించారు. పీయూష్ గోయల్ ఉల్టా పల్టా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీయూల్ గోయల్ కాదు.. పీయూల్ గోల్ మాల్ అని విమర్శించారు.  
 
దేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేసీఆర్ అన్నారు. ప్రధాన మంత్రి మోదీ సొంత రాష్ట్రంలో కూడా విద్యుత్ కోసం రైతులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం