మెక్‌ డోనాల్డ్స్‌ కాఫీలో బొద్దింక కాళ్లు.. వీడియో చూడండి..

గతంలో కేఎఫ్‌సీ చికెన్‌లో ఎలుక ముక్కంటూ పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కమ్మటి మెక్ డొనాల్డ్స్ కాఫీలో బొద్దింక కాళ్లు కనిపించాయి. కమ్మ‌టి కాఫీ రుచి కోసం మెక్‌ డోనాల్డ్స్‌లోకి వెళ్లిన ఓ క‌స్ట‌

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (06:15 IST)
గతంలో కేఎఫ్‌సీ చికెన్‌లో ఎలుక ముక్కంటూ పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కమ్మటి మెక్ డొనాల్డ్స్ కాఫీలో బొద్దింక కాళ్లు కనిపించాయి. కమ్మ‌టి కాఫీ రుచి కోసం మెక్‌ డోనాల్డ్స్‌లోకి వెళ్లిన ఓ క‌స్ట‌మ‌ర్‌కి చేదు అనుభ‌వం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. థాయిలాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
బ్యాంకాక్‌‌కు చెందిన నోస్టాలిక్‌ ఐక్‌ (28) అనే వ్య‌క్తి స్థానిక మెక్‌డోనాల్డ్స్‌కి వెళ్లి కాఫీ ఆర్డ‌ర్ చేశాడు. ఆ కాఫీలో బొద్దింక కాళ్లు క‌నిపించ‌డంతో మ‌రో కప్పులో కాఫీ తెప్పించుకున్నాడు. రెండోసారి తెచ్చిన కాఫీలో కూడా బొద్దింక కాళ్లు కనిపించాయి. దీనిని త‌న స్మార్ట్‌ఫోన్‌లో ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టాడు. 
 
మెక్‌డొనాల్డ్స్‌లో అధిక శుభ్రత పాటిస్తార‌ని తాను అనుకున్నాన‌ని, అయితే, ఇలాంటి అనుభవం ఎదురవుతుందని అనుకోలేదన్నాడు. దీనిపై మెక్‌డొనాల్డ్స్ ప్ర‌తినిధులు స‌ద‌రు వినియోగదారుడికి క్షమాపణలు చెప్పారు. దీనిపై విచారణ చేపడ‌తామ‌ని మెక్ డొనాల్డ్స్ సంస్థ హామీ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments