ఆ పేస్ట్‌తో బొద్దింకలకు చెక్...
వంటింట్లో సింకుల వద్ద బొద్దింకలు ఎక్కువగా చేరుతుంటాయి. అలా చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి ముక్కలను దంచి ఆ పేస్ట్‌ను అవి వచ్చే చోట ఉంచాలి.
* వంటింట్లో సింకుల వద్ద బొద్దింకలు ఎక్కువగా చేరుతుంటాయి. అలా చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి ముక్కలను దంచి ఆ పేస్ట్‌ను అవి వచ్చే చోట ఉంచాలి.
* క్యాబేజీ ఉడికించేటప్పుడు బాగా వాసన వస్తుంది. అలారాకుండా ఉండేందుకు అందులో చిన్న అల్లం ముక్క వేస్తేచాలు. వంటింటిని శుభ్రం చేసే నీళ్లలో కాసింత పసుపు కలపాలి. దాని వల్ల ఈగలు రాకుండా ఉంటాయి.
* గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు వేయాలి. అలా చేస్తే వాటి పెంకు సులువుగా వచ్చేస్తుంది.