Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిక్కింపై చిల్లరగా కామెంట్స్ చేసిన ప్రియాంకా.. కడిగిపారేస్తున్న నెటిజన్లు

దేశంలో ఉన్న అతి చిన్న రాష్ట్రాల్లో సిక్కిం ఒకటి. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న సిక్కింపై బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నోరు జారారు. ఆమె చేసిన చిల్లర వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడు

Advertiesment
సిక్కింపై చిల్లరగా కామెంట్స్ చేసిన ప్రియాంకా.. కడిగిపారేస్తున్న నెటిజన్లు
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (18:01 IST)
దేశంలో ఉన్న అతి చిన్న రాష్ట్రాల్లో సిక్కిం ఒకటి. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న సిక్కింపై బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నోరు జారారు. ఆమె చేసిన చిల్లర వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
ఇటీవల ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేదికగా ఆమె మాట్లాడుతూ, సిక్కం ఈశాన్య భారతంలో ఓ చిన్న రాష్ట్రం. అక్కడ ఫిల్మ్ఇండస్ట్రీ లేదు.. కనీసం సినిమాలు తీసేందుకు కూడా ఎవరూ ముందుకు రారు. అందుకు కారణం నిత్యం అక్కడ తిరుగుబాటులు, అల్లర్లు చెలరేగి ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. అయినా అతి కష్టం మీద ఇబ్బందులను ఎదుర్కొని ఈ సినిమా తెరకెక్కించాం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన తొలి సినిమా ‘పహునా’నే అంటూ’ ప్రియాంక చెప్పుకొచ్చింది. 
 
దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సిక్కిం చాలా ప్రశాంతతో కూడుకున్న రాష్ట్రమని కొందరు కామెంట్ చేస్తే.. అసలు సిక్కిం ఎక్కడ ఉంటుందో ప్రియాంకకు తెలుసా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు సిక్కిం ఫిల్మ్‌ ఇండస్ట్రీ గురించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ప్రియాంకకు సూచిస్తున్నారు. 
 
కాగా, ప్రియాంక చోప్రా నిర్మాతగా 'మారి పహునా' అనే మూవీ నిర్మించింది. సిక్కిం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న క్రమంలో ఇద్దరు చిన్నారి శరణార్థుల మధ్య చోటుచేసుకునే పరిణామాలతో ఉద్వేగపూరితంగా తెరకెక్కించారు. ‘పహునా’ను టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా.. ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా ఆమె సిక్కిం రాష్ట్రం గురించి చిల్లరగా మాట్లాడి చిక్కుల్లో పడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాగా చూపించాను... ప్లీజ్ తీసేయండి... మాజీ మిస్ యూనివర్శ్ 'హేట్ స్టోరీ 4' సీన్స్