Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుల్లుగా మద్యం తాగి నోట్లో పర్‌ఫ్యూమ్ స్ప్రే కొట్టుకున్నాడు..! అయినా దొరికిపోయాడు!!

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (19:03 IST)
సాధారణంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవాళ్లలో చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోతుంటారు. మందు చూస్తే కాస్త కూడా తట్టుకోలేరు. డ్రైవింగ్ చేయాలన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఫుల్లుగా మద్యాన్ని లాగించేస్తారు.


తాగడం పూర్తయ్యక కానీ డ్రైవింగ్ చేయాలన్న విషయం గుర్తుకు రాదు. ఆ సమయంలో చేసేదేమీ లేక ఎలాగోలా డ్రైవింగ్ చేస్తూ ఇంటికి వెళ్లిపోదాం అనుకుంటారు. అయితే కర్మ కొద్దీ పోలీసులు వాళ్ల వాహనం ఆపితే అంతే సంగతులు.
 
ఇలాగే అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి తన వాహనంలో వెళ్తున్నాడు. ఇంతలోనే తన వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నట్టు అనిపించింది. అంతే వేంటనే ఆలస్యం చేయకుండా తన దగ్గర ఉన్న ఏక్స్ పర్‌ఫ్యూమ్‌ను తన నోట్లో స్ప్రే చేసుకున్నాడు. తాగిన వాసన పోలీసులకు రావద్దనుకున్నాడో ఏమో గానీ వెంటనే స్ప్రేను నోట్లో కొట్టుకున్నాడు.
 
స్ప్రే అయితే నోట్లో కొట్టుకున్నాడు సరే..అయినప్పటికీ మనోడు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు అతడి వాహనంలో 12 బీర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 ఖాళీ బీర్ల టిన్‌లను గుర్తించారు. అంతేకాకుండా సదరు వ్యక్తి కారు నడుపుతూనే ఓ బీరు సీసాను తన కాళ్ల మధ్యలో పెట్టుకొని ఉన్నాడు.

అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడంతో అతడు ఫుల్లుగా మద్యం తాగినట్లు తేలింది. ఆ వ్యక్తి నోట్లో స్ప్రే కొట్టుకున్నప్పటికీ.. పోలీసుల బారి నుంచి తప్పించుకోలేకపోయాడు. పోలీసులు వెంటనే అతడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments