నా భర్త శృంగారం చేయమంటే టైమ్ లేదంటాడు.. ఏం చేయాలి?

బుధవారం, 27 మార్చి 2019 (17:53 IST)
భార్యాభర్తలిద్దరం ఐటీ ఉద్యోగులస్తులం. బెంగుళూరులో పని చేస్తూ అక్కడే నివశిస్తున్నాం. వారంలో కనీసం ఒక్కసారి కూడా నా భర్త శృంగారం చేయనంటున్నాడు. ఇద్దరం బిజీగా ఉన్నప్పటికీ.. నేనే చొరవ తీసుకుని చేయమని కోరినా... టైమ్ లేదు.. వర్క్ ప్రెజర్ అంటూ దాటవేస్తున్నాడు. అప్పటికీ నా బలవంతం మీద వారంలో ఒక్కసారి మాత్రమే చేస్తాడు. అదీ కూడా ఒక్క నిమిషంలో అంతా పూర్తి చేస్తాడు. దీంతో పూర్తిగా అసంతృప్తి చెందుతున్నా. నాకేమో.. శృంగార కోర్కెలు ఎక్కువ. ఏం చేయాలి? 
 
చాలామంది యువ జంటలు ఇదే తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటివారు తమ శృంగార కోర్కెలను బయటకు చెప్పుకోలేక తమలో తామే అణుచుకుని జీవిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేసే దంపతులైతే మొక్కుబడిగా వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే శృంగారంలో పాల్గొంటున్నట్టు అనేక సర్వేలు వెల్లడించాయి. 
 
ఇక్కడో విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. శృంగారం అనేది యాంత్రికంగా చేసుకునేది కానే కాదు. శరీరం యంత్రం కాదు. దానికి స్పందన అవసరం. ప్రేమ, ఇష్టం, కోరిక, పాజిటివ్ ఆలోచనలు తదితరాలన్నీ కలిస్తేనే శరీరం. అలాంటి శరీరానికి శృంగారం కావాలి. పాజిటివ్‌గా ఆలోచించే మనసు నుంచే మెదడు సంకేతాలు అందుకుని శృంగార అవయవాల పనితీరుని నిర్దేశిస్తుంది. 
 
ప్రపంచీకరణ, పెరిగిన పని గంటలు పరిస్థితులు జీవితంలో వడి, వేగం పెరిగి మానసిక ఒత్తిడిని పెంచి, శృంగార జీవితం మీద అపారమైన వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాంటి వారు శృంగారానికి ఎక్కువ సమయాన్ని కేటాయించేలా పని వేళల్ని మార్చుకోవాలి. వారానికి 4-5 రోజులు శృంగారంలో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చెమట పొక్కులు వచ్చిన ప్రాంతాల్లో ఇలా చేస్తే..?