Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

Advertiesment
Drinking milk

సిహెచ్

, సోమవారం, 3 నవంబరు 2025 (21:20 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
కొంతమంది బరువు ఎలా తగ్గాలా అని తెగ బాధపడిపోతుంటారు. మరికొందరు ఎంత తిండి తిన్నా కూడా పీలగా, బక్కపలచగా వుంటారు. ఐతే ఇలాంటివారు ఎలాంటి ఆహారం తింటే బరువు పెరగవచ్చో తెలుసుకోకుండా ఏదిబడితే అది తినేస్తుంటారు. అలాకాకుండా ఎలాంటి పదార్థాలను తింటే బరువు పెరగవచ్చో తెలుసుకుని వాటిని తింటుంటే బరువు పెరిగే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
పాలలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వుంటాయి. వీటిని తాగుతుంటే క్రమంగా బరువు పెరిగే అవకాశం వుంటుంది. అలాగే అరటిపండు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇది శక్తిని పెంచడానికి, బరువు పెరగడానికి సహాయపడుతుంది. వేరుశెనగ వెన్న. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. దీనిని టోస్ట్, క్రాకర్స్ లేదా స్మూతీస్‌లో తీసుకోవచ్చు.
 
కోడిగుడ్లు. ఇవి అధిక నాణ్యత గల ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి, అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. బంగాళాదుంపలలో కూడా కార్బోహైడ్రేట్లలో ఎక్కువగా ఉంటాయి, ఇది బరువు పెరగడానికి అవసరం. వీటిని వివిధ రకాలుగా తయారు చేసి తీసుకోవచ్చు. ఈ ఆహారాలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు వుండే అవకాడో, నూనెలు తీసుకుంటుండాలి. అలాగే ప్రోటీన్లు వుండే చికెన్, చేపలు, బీన్స్, క్వినోవా, ఓట్స్, గోధుమ రొట్టె వంటి ఇతర పోషకమైన ఆహారాలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలకు సహాయపడుతుంది.
 
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. పూర్తి సమాచారం కోసం ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?