Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిలేషన్‌షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?

Advertiesment
couple

సిహెచ్

, సోమవారం, 26 మే 2025 (14:02 IST)
రిలేషన్ షిప్, డేటింగ్, వివాహం... వీటిలో ఏది జరిగినా అమ్మాయిలు కాస్తంత బొద్దుగా, లావుగా కనబడతుంటారు. దీనికి కారణాలు వున్నాయంటున్నారు వైద్య నిపుణులు. రిలేషన్ షిప్ ప్రారంభం కాగానే అమ్మాయిలపై హార్మోన్ల ప్రభావం చూపటం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా భాగస్వామితో సంతోషంగా గడుపుతూ వుండటంతో ఒత్తిడిస్థాయి తగ్గిపోతుంది. మరోవైపు ఇంతకుముందులా రెగ్యులర్ వ్యాయామం వంటివాటికి దూరమవుతారు. ఇవన్నీ కలిసి అమ్మాయిలు కాస్తంత ఒళ్లు చేసినట్లు తయారవుతారట.
 
రిలేషన్ షిప్ లో వున్న అమ్మాయిల్లో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలు క్రమంగా తగ్గిపోతాయి. అదేసమయంలో హ్యాపీ హార్మోనులుగా చెప్పుకునే ఆక్సిటోసిన్, సెరోటోనిన్ క్రమంగా పెరుగుతాయి. దీనితో సంతోషం, సుఖమయ నిద్ర అన్నీ చేకూరుతాయి. ఫలితంగా శరీరం నునుపుదేలి కాంతివంతంగానూ, కాస్త లావైనట్లు తయారవుతారు.
 
కానీ కొంతమంది విషయంలో రిలేషన్ షిప్ పెట్టుకున్న కొన్నిరోజులుగా బక్కపలచగా మారిపోతుంటారు. దీనికి కారణం... తన భాగస్వామిపై నమ్మకం లేకపోవడం, అతడి ప్రేమ కపటంతో కూడి వుండటం వంటి వాటితో అమ్మాయిలు తీవ్ర నిరాశకు లోవుతారు. రాత్రిళ్లు నిద్రపట్టక సరైన ఆహారం తీసుకోలేరు. దీని కారణంగా సన్నగా మారిపోతుంటారు. కనుక రెండింటి వెనుక కారణం నమ్మకమైన రిలేషన్ షిప్, నమ్మకం లేని రిలేషన్ షిప్‌లే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?