రోజూ ఉదయం లేదా కార్యాలయాల్లో పని ఒత్తిడి, అలసట కారణంగా ఒక చిన్న విరామం తీసుకునేటప్పుడు.. ఆఫీసుల్లో అందుబాటులో వుండే టీ బ్యాగులతో టీ తాగేయడం చేస్తుంటారు చాలామంది. అలాంటి టీ బ్యాగులతో టీ తాగే వారు మీరైతే ఈ కథనం చదవండి.
చాలా టీ బ్యాగులను నైలాన్ లేదా ప్లాస్టిక్ వంటివాటితో తయారు చేస్తారు. కాబట్టి దీన్ని వేడినీటిలో ఉంచినప్పుడు మైక్రోబ్లాస్టిక్‌ను విడుదల చేస్తాయి. తర్వాత మనం తాగే ఆ టీ ద్వారా అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది చాలా కాలం పాటు శరీరంలో హార్మోన్ సమతుల్యత, జీర్ణ సమస్యలు, కణాల వాపు, కాలేయం, మూత్రపిండాలు ఒత్తిడిని కలిగిస్తుంది.
కొన్ని టీ బ్యాగులు శరీరంలో క్యాన్సర్‌ను కలిగిస్తాయి. ఎందుకంటే టీ బ్యాగుల్లో ఉపయోగించే ప్లాస్టిక్ ద్వారా ఎపిక్లోరోహైడ్రిన్ అనే రసాయనాలు టీ ద్వారా శరీరానికి చేరుతాయి. తద్వారా క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీ బ్యాగుల్లోని తేయాకు చాలాకాలం ప్రోసెస్ చేయడం.. కృత్రిమ ఫ్లేవర్లను కలపుతారు. తద్వారా ఈ టీ సేవించడం ఆరోగ్యానికి ప్రమాదకరం.
ఇందులో కెఫిన్ ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయి. దీని ఫలితంగా రక్త ఒత్తిడి పెరుగుతుంది, గుండె సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. టీ బ్యాగుల్లో ఎక్కువ మోతాదులో ఉండే టానిన్‌ల వల్ల దంతాలకు మంచిది కాదు. ఇంకా ఇవి అజీర్తి, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.