జనసేనకు ఎస్పీవై రెడ్డి ఝలక్?

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (18:58 IST)
ఇప్పుడిప్పుడే రాజకీయ అరంగేట్రం చేసి ఓట్ల వేటలో తప్పటడుగులు వేస్తున్న జనసేన పార్టీకి ఎదురవుతున్న ఇబ్బందులు చూస్తూంటే ఆదిలోనే హంసపాదు అన్నట్లు అనిపిస్తోంది.


వివరాలలోకి వెళ్తే... తెలుగుదేశం పార్టీలో టికెట్ నిరాకరణకు గురై... జనసేనలోకి అడుగుపెట్టిన ఎస్పీవై రెడ్డికి జనసేనాని ఊహించని రీతిలో ఏకంగా మూడు టిక్కెట్లు ఇచ్చారు. వీటిలో... నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి బరిలోకి దిగగా.. ఆయన చిన్న కుమార్తె అరవిందరాణి బనగానపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్‌ రెడ్డి నంద్యాల శాసనసభ స్థానంలో పోటీ చేస్తున్నారు. 
 
అయితే మంగళవారం కర్నూలు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్పీవైరెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామనీ, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ చేయడంతో ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారనీ...  జనసేన పార్టీ తరఫున ఆయన కుటుంబం వేసిన నామినేషన్లను అన్నింటినీ ఉపసంహరించుకోనున్నారనీ తెలుస్తోంది.
 
అదేదో సినిమాలో చెప్పినట్లు... పార్టీలు, అధినేతలు అన్నీ కొత్తవే అయినప్పటికీ... ప్రజా క్షేత్రం నుండి వెళ్లే ప్రతినిధులు మాత్రం ఎప్పుడు ఏ పక్షానికి వెళ్తారో... ఎప్పుడు ఏ కండువా కప్పుకుంటారో చెప్పలేని వాళ్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments