లాహోర్‌లోని అనార్కలి మార్కెట్‌లో భారీ పేలుడు - ముగ్గురి మృతి

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (19:07 IST)
పాకిస్థాన్ దేశంలోని ప్రముఖ నగరమైన లాహోర్‌లోని అనార్కలి మార్కెట్ పాన్ మండి వద్ద గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది వరకు గాయపడినట్టు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. అయితే, ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం రావాల్సివుంది. 
 
ఈ ప్రమాదంలో లాహోర్ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన ప్రాంతం ఎక్కువగా భారతీయ వ్యాపారులు వ్యాపారం చేసుకునే ఏరియా అని, అందుకే ఈ పేలుడుపై అనేక అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. 
 
నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌ను చేసుకుని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, ఘటనా ప్రాంతంలో సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇదిలావుంటే, ఈ పేలుడు ఇప్పటివరకు ఏ ఒక్క ఉగ్రవాద సంస్థ నైతిక బాధ్యత వహించలేదు. అయితే, పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఈ పేలుడు బైకులో అమర్చిన పేలుడు పదార్థాల వల్ల జరిగినట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments