గ్రామ్ సురక్షా యోజన-పోస్టాఫీస్‌ నుంచి సూపర్ స్కీమ్.. రూ.1,411 చెల్లిస్తే?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (18:59 IST)
పోస్టాఫీస్‌ ఒక మంచి స్కీమ్‌ను అమలు చేస్తోంది. అలాగే ఈ పథకం కుటుంబ ఆర్థిక భద్రతకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారికి గ్రామ్ సురక్ష యోజన బాగా సహకరిస్తుంది. 
 
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో భాగంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది ఇండియా పోస్ట్. దేశంలోని గ్రామీణుల కోసం 1995లో గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని రూపొందించింది ఇండియా పోస్ట్. 
 
గ్రామ్ సురక్ష యోజన స్కీమ్‌లో చేరిన వారికి 80 సంవత్సరాలు వయసు వచ్చాక.. అంటే మెచ్యూరిటీ సమయంలో బోనస్ వస్తుంది. 
 
ఒకవేళ ఈ స్కీమ్‌లో చేరిన వారు ముందే మరణిస్తే, నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందుకు సంబంధించిన డబ్బు అందిస్తుంది పోస్టాఫీస్. 19 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న వారంతా ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 
 
ఇక ఈ స్కీమ్‌ కోసం కనీసం రూ.10 వేల ఇన్సూరెన్స్‌ మొత్తానికి పాలసీ తీసుకోవాలి. అలాగే గరిష్టంగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియాన్ని... నెల వారీగా, మూడు నెలల వారీగా, ఆరు నెలల వారీగా, ఏడాదొకసారి చొప్పున చెల్లించే వెసులుబాటు కల్పించింది. 
 
ఇక పాలసీ కొనుగోలు చేసిన నాలుగేళ్లకు లోన్ కూడా పొందొచ్చు. అలాగే నెలవారీ ప్రీమియం విషయానికి వస్తే, 55 ఏళ్లకు రూ.1515 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఇక 58 ఏళ్లకుగాను రూ.1463, 60 ఏళ్లకు అయితే రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఈ స్కీమ్‌తో తక్కువ డబ్బుతో ఎక్కువ ఆదాయాన్ని కల్పిస్తుంది ఇండియా పోస్ట్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments