Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మీటూ... జపాన్‌లో కూటూ...

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (15:57 IST)
భారత్‌లో మీటూ ఉద్యమం ఓ ఊపు ఊపింది. చిత్ర పరిశ్రమలో తాము ఎదుర్కొన్న వైధింపులను బహిర్గతం చేసేదుకు ఈ ఉద్యమం ఒక వేదికైంది. ఈ ఉద్యమం ద్వారా చాలామంది సెలెబ్రిటీలు తాము ఎదుర్కొన్న అవమానాలు, వేధింపులను బహిర్గతం చేశారు. వారికి న్యాయం జరగకపోయినప్పటికీ... తమకు జరిగిన అన్యాయాన్ని మాత్రం ప్రపంచానికి తెలియజేశారు. దీంతో అనేక పెద్దల చీకటి బోగోతం బయటపడింది. పెద్ద మనుషులుగా చెలామణి అయిన కొందరి ప్రముఖులను మీటూ ఉద్యమం ఓ కుదుపు కుదిపింది. దేశం ఏదైనా మహిళలపై మాత్రం ఏదో విధమైన వేధింపులు జరుగుతునే ఉన్నాయి. దీనికి ధనిక దేశం.. పేద దేశం అనే తేడా లేదు. ఈ క్రమంలో "టాప్ ఆఫ్ ది ఎర్త్‌"గా పేరొందిన జపాన్ దేశంలో మహిళా ఉద్యోగినులపై ఓ విచిత్రమైన వేధింపులకు ఫలితంగా 'కూటూ' ఉద్యమం తెరపైకి వచ్చింది. 
 
'మీటూ' ఉద్యమంలాగానే జపాన్‌లో అదే తరహాలో సామాజిక వేదికల అండగా 'కూటూ' ఉద్యమం తెరపైకి వచ్చింది. జపాన్ ఆఫీసుల్లో మహిళా ఉద్యోగినులకు సూట్‌తో పాటు హైహీల్స్‌ను తప్పనిసరి చేశారు. దీంతో మహిళలు హైహీల్ తప్పని చేయటాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేస్తున్నంత సేపు హైహీల్స్ వేసుకోవటంతో కాళ్లలో రక్త ప్రసరణ తగ్గిపోవటంతో పాటు కాలు స్లిప్ అయితే గాయాలపాలయ్యే అవకాశముందని జపనీస్ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
అందుకే 'కూటూ' పేరుతో ఆన్ లైన్ ఉద్యమానికి తెరలేపారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా పనిచేస్తున్నారనీ.. అలాంటప్పుడు ఇద్దరినీ వేర్వేరుగా ఎందుకు చూస్తున్నారనీ.. వేర్వేరుగా చూడటం ఎందుకని జపాన్ ఉద్యోగినులు ప్రశ్నిస్తున్నారు. జపనీస్ భాషలో 'కూట్సు' అంటూ బూట్లు అనే అర్థం వస్తుంది. అందులోంచి మొదటి అక్షరాన్ని తీసుకుని 'కూటూ' పేరుతో ఉద్యమం లేవనెత్తారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments