Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు మైక్రోవేవ్ ఛాలెంజ్‌ని గురించి ఎప్పుడైనా విన్నారా?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (15:48 IST)
సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెటిజన్లకు బాగా టైమ్ పాస్ అవుతోంది. అప్పట్లో ఐస్ బకెట్ ఛాలెంజ్, ఆ తర్వాత కికి ఛాలెంజ్, ట్రాష్ ఛాలెంజ్ ఇలాంటివి ఎన్నో నెటిజన్‌లను మురిపించాయి. తాజాగా మరొక ఛాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
 
అదే మైక్రోవేవ్ ఛాలెంజ్..ఇందులో పాల్గొనే వారు దానికి సంబంధించిన వీడియోను మైక్రోవేవ్‌ఛాలెంజ్ హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయాలి. అసలు మైక్రోవేవ్ ఛాలెంజ్ అంటే ఏమిటో ఇప్పుడు మనమూ తెలుసుకుందాం..
 
మనం సాధారణంగా మైక్రోవేవ్ ఓవెన్‌ను ఏదైనా ఫుడ్‌ను వేడి చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఫుడ్‌ను ఓవెన్‌లో పెట్టినప్పటి నుంచి అది లోపల తిరుగుతుంటుంది. అలా గుండ్రంగా తిరుగుతూ వేడెక్కుతుంది. సేమ్ ఫుడ్ ఎలాగైతే మైక్రోవేవ్ ఓవెన్‌లో తిరుగుతుందో అలాగే మీరు కూడా తిరగాలి. అలా రౌండ్‌గా తిరుగుతూ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలి. 
 
అదే ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ టిక్‌టాక్ యాప్‌లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అక్కడి నుండి ఇది మరింత వైరల్ అవుతూ సోషల్ మీడియాకు చేరింది. కొంతమంది ఈ మైక్రోవేవ్ ఛాలెంజ్‌లో పాల్గొని వాటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments