కుల్‌భూషణ్ జాదవ్ నిర్బంధం అక్రమం : పాక్‌కు ఝలక్ ఇచ్చిన ఐసీజే

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (15:45 IST)
పాకిస్థాన్‌కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీజే) తేరుకోలేని షాకిచ్చింది. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉంటోన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. పైగా, కుల్‌భూషణ్ నిర్బంధం అక్రమమని తేల్చింది. పైగా, దీనిపై తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది. 
 
భారత గూఢచార సంస్థ 'రా' కోసం గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ కుల్‌భూషణ్‌ను 2016 మార్చి 3వ తేదీన పాకిస్థాన్ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అనంతరం 2017లో పాక్ మిలిటరీ న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష విధించింది. దీనిపై అభ్యంతరాలు తెలిపిన భారత్.. నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో సవాల్ చేయడంతో దీనిపై విచారణ జరిగింది. 
 
ఈ కేసులో పాకిస్థాన్ పునఃసమీక్ష చేసే వరకు కుల్ భూషణ్ మరణశిక్ష అమలుపై అప్పట్లో ఐసీజే స్టే విధించింది. భారత్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. పాక్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ గురువారం ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments