Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ బ్రదర్ అండ్ సిస్టర్‌కు ఏమైంది? అదృశ్యశక్తులుగా కిమ్ జాంగ్ - యో జాంగ్

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:30 IST)
ఉత్తరకొరియా దేశాధీశులు కిమ్ జాంగ్ ఉన్, ఆయన సోదరి కిమ్ యో జాంగ్‌లకు ఏమైందో తెలియడం లేదు. ఒకరు మారిస్తే ఒకరు అదృశ్యమైపోతున్నారు. తొలుత కిమ్ జాంగ్ ఉన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇపుడు ఆయన సోదరి కిమ్ యో జాంగ్ గత నెల రోజులుగా కనిపించడం లేదట. 
 
నిజానికి హృద్రోగ ఆపరేషన్ తర్వాత కిమ్ జాంగ్ ఉన్న కోమాలోకి వెళ్లిపోయారని ఒకసారి, లేదులేదు ఆయన చనిపోయారంటూ మరోమారు రూమర్లు గుప్పుమన్నాయి. దీంతో ఆయన సోదరి కిమ్ యో జాంగ్‌కు సగం అధికారాలు కట్టబెట్టారని ఇంకోసారి కథనాలు వెలువడ్డాయి. 
 
కిమ్ సలహాదారు కూడా అయిన జాంగ్ ఇటీవల వార్తల్లోని వ్యక్తి అయ్యారు. తన సోదరుడిని విమర్శించేవారిపై విరుచుకుపడ్డారు. కవ్వింపులకు దిగితే సహించబోమని ప్రత్యర్థులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉభయ కొరియాల మధ్య చర్చలకు వేదికైన అనుసంధాన కార్యాలయాన్ని పేల్చివేసేందుకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
 
ఈ క్రమంలో విదేశాంగ విధానాలలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న కిమ్ యో జాంగ్ పేరు అంతర్జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా వినిపించింది. అయితే, సోదరికి వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి కిమ్ తట్టుకోలేకపోతున్నారంటూ తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. జులై 27 నుంచి జాంగ్ బహిరంగంగా కనిపించకపోవడాన్ని బట్టి చూస్తే ఈ వార్త నిజమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments