Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘‘డోనల్డ్ ట్రంప్ అబద్ధాలకోరు, నిజాయతీ లేదు, ప్రపంచంలో అత్యంత ప్రమాదకారి’’: అమెరికా అధ్యక్షుడిపై సోదరి వ్యాఖ్యలు

Advertiesment
‘‘డోనల్డ్ ట్రంప్ అబద్ధాలకోరు, నిజాయతీ లేదు, ప్రపంచంలో అత్యంత ప్రమాదకారి’’: అమెరికా అధ్యక్షుడిపై సోదరి వ్యాఖ్యలు
, సోమవారం, 24 ఆగస్టు 2020 (13:00 IST)
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఓ అబద్ధాల కోరని, ఆయనకు ఎలాంటి నీతి నియమాలూ లేవని ఆయన సోదరి, మాజీ ఫెడరల్ జడ్జి మెరియానే ట్రంప్ బేరీ దూషిస్తున్నట్లు ఓ సీక్రెట్ రికార్డింగ్‌లు వెలుగులోకి వచ్చాయి. ఈ రికార్డింగ్‌లను మెరియానే మేనకోడలు మేరీ ట్రంప్ రికార్డు చేశారు. గత నెలలో ఆమె ట్రంప్‌ను తీవ్రంగా విమర్శిస్తూ ఓ పుస్తకం కూడా విడుదల చేశారు.

 
''ఓరి దేవుడా.. ఆ ట్వీట్ చూడు. అన్నీ అబద్ధాలే. అసలు నిజాయతీ లేదు. క్రూరమైనవాడు''అంటూ మెరియానే రికార్డింగ్‌లలో వ్యాఖ్యానించారు. తాను కేసుల వలలో చిక్కుకోకుండా చూసుకునేందుకు వీటిని రికార్డ్ చేశానని మేరీ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ''రోజుకొకటి వస్తున్నాయి. ఎవరు వీటిని పట్టించుకుంటారు'' అని ట్రంప్ వీటిలో వ్యాఖ్యానించారు. తాజా రికార్డింగ్‌లపై వాషింగ్టన్ పోస్ట్ తొలుత కథనం ప్రచురించింది. ఆ తర్వాత అసోసియేటెడ్ ప్రెస్‌లోనూ వార్తలు వచ్చాయి.

 
''వేరొకరితో పరీక్షలు రాయించారు''
సరిహద్దుల్లో వలసదారుల పిల్లలను నిర్బంధించేలా ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన కొత్త వలసల విధానాన్ని సీక్రెట్ రికార్డింగ్‌లలో మరియానే విమర్శించారు. ''ప్రజల మెప్పు పొందేందుకే ఆయన ఇవన్నీ చేస్తున్నారు''అని ఆమె వ్యాఖ్యానించారు.

 
''ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని మా కుటుంబం ఎలా తయారుచేసిందో చూడండి. యూనివర్సిటీలో చేరేందుకు అర్హత పరీక్ష శాట్ తనకు బదులు వేరొకరు రాసేందుకు మా అంకుల్ డబ్బులు కట్టారు''అని పుస్తకంలో మేరీ రాశారు. ఆ పరీక్ష రాసిన వ్యక్తి పేరు కూడా తనకు ఇంకా గుర్తుందని రికార్డింగ్‌లలో మరియానే వివరించారు.

 
'వేరొకరు పరీక్ష రాయడం వల్లే ఆయనకు పెన్సిల్వేనియా యూనివర్సిటీలో సీటు వచ్చింది''అని ఆమె వ్యాఖ్యానించారు. మొదట్లో ట్రంప్‌కు మరియానే మద్దతు పలికేవారు. తాము చాలా సన్నిహితంగా ఉంటామని ఇదివరకు చెప్పారు. ''ఓ ఆపరేషన్ తర్వాత నన్ను చూసేందుకు ట్రంప్ రోజూ ఆసుపత్రికి వచ్చేవారు'' అని ఆమె వివరించారు.

 
''అప్పుడు నన్ను తను చాలా ఆప్యాయంగా చూసుకునేవాడు. రోజూ ఆసుపత్రికి వచ్చేవాడు. నాకు ఆయన గురించి బాగా తెలుసు. చిన్నప్పుడు ప్రతి విషయంలోనూ ఇద్దరం పోటీ పడేవాళ్లం''

 
''స్టార్మీ డేనియేల్స్‌కు ఫీజు చెల్లించండి''
స్టార్మీ డేనియేల్స్‌గా సుపరిచితమైన నటి స్టెఫానీ క్లిఫోర్డ్‌కు 34,000 డాలర్లు చెల్లించాలని డోనల్డ్ ట్రంప్‌కు కాలిఫోర్నియా సుపీరియర్ జడ్జ్ ఆదేశాలు జారీచేశారు. ట్రంప్, డేనియేల్స్ మధ్య అక్రమ సంబంధంపై ఓ రహస్య ఒప్పందాన్ని బయటపెట్టిన కేసులో న్యాయవాదులకు చెల్లించిన రుసుములకు సంబంధించి ఈ తీర్పు వెలువరించారు. 2006లో నెవడా, కాలిఫోర్నియాల్లోని ఓ రిసార్ట్, ఓ హోటల్‌లో ట్రంప్, తను సెక్స్‌లో పాల్గొన్నామని డేనియేల్స్ చెప్పారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజంలేదని ట్రంప్ ఖండించారు.

 
అధ్యక్ష ఎన్నికలకు ముందు, 2016లో ఈ విషయం బయటపెట్టకుండా ఉండేందుకు 1,30,000 డాలర్లు ఇస్తామని ట్రంప్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని డేనియేల్స్ వివరించారు. ఆ కేసును కొట్టివేసినప్పటికీ.. వివాదంలో ఆమె న్యాయవాదుల రుసుమును చెల్లించాలని ట్రంప్‌కు జడ్జి ఆదేశాలు జారీచేశారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న సోనియా గాంధీ..