Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి బయట భార్యను పొడిచి చంపేసిన భర్త.. ఎక్కడ?

Webdunia
గురువారం, 30 జులై 2020 (08:45 IST)
ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. నర్సుగా పనిచేసే కట్టుకున్న భార్యను ఆమె పని చేసే ఆస్పత్రి బయట కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగింది. మృతురాలు, ఆమె భర్త మన భారతీయులే. అదీ కేరళ రాష్ట్రానికి చెందిన వారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని కొట్టాయంకు చెందిన ఓ నర్సు మెరీన్ జాయ్ (26) అనే మహిళ నర్సుగా విద్యాభ్యాసం పూర్తి చేసి, తన భర్త ఫిలిప్ మాథ్యూతో కలిసి అమెరికాకు వెళ్ళింది. అక్కడ కోరల్ స్ప్రింగ్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 
 
అయితే, భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమోగానీ... బుధవారం మెరీన్ జాయ్ తన విధులు ముగించుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరింది. అప్పటికే ఆస్పత్రి పార్కింగ్ స్థలంలో ఉన్న భర్త ఫిలిప్ మాథ్యూ కత్తితో దాడిచేసి విచక్షణ రహితంగా పొడిచాడు. 
 
ఈ దాడి ఆస్పత్రి ఎదుటే జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. 
 
కాగా, భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఫిలిప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments