గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎలాంటి హంతకుడో చెప్పనవసరం లేదు. దూబే వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. 20 మందికి పైగా పోలీసులను పొట్టనబెట్టుకున్నాడు దూబే. చివరకు పోలీసుల చేతిలో హతమయ్యాడు. అయితే దూబే మరణించిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడలేదు. తాజాగా ఆయన భార్య రిచా దుబే మాట్లాడిన మాటలపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.
నా భర్త మంచి వ్యక్తి. అంతకు మించి మంచి తండ్రి. ఇక కొడుగ్గా కూడా వందకు వంద మార్కులు ఇవ్వొచ్చు. దూబే ఎక్కడున్నా ప్రతినెలా ఇంటికి 40 వేలు పంపించేవాడు. మొదటి కొడుకు రష్యాలో మెడిసిన్ చేస్తున్నాడు. రెండవ కొడుకు 12వ తరగతిలో 90 శాతం మార్కులు సాధించాడు.
తల్లిదండ్రులంటే దూబేకు ఎంతో గౌరవం. వారికి పాదపూజ చేస్తూ ఉంటాడు. ఈ నెల 3వ తేదీన తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నాకు దూబే నుంచి ఫోన్ వచ్చింది. లక్నోలోని ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పాడు. దీంతో స్నేహితుల సాయంతో అక్కడికి వెళ్ళిపోయాను.
తన భర్త నేరస్థుడై ఉండొచ్చు కానీ చాలా మంచి వ్యక్తి. నేను నా భర్తతో మాట్లాడడం అదే చివరిసారి. నా భర్త మృతిపై న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. రాజ్యాంగం పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతోంది రిచా దూబే.