Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ఫస్ట్ లేడీ.. అలా అందరినీ ఏప్రిల్ ఫూల్స్ చేశారు..?

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (17:20 IST)
April Fools Day
ఏప్రిల్‌ ఫస్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫూల్స్‌ డేగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ సందర్భంగా చాలామంది సన్నిహితులను, స్నేహితులను సరదాగా ఆటట్టిస్తారు. ఏప్రిల్‌ ఫూల్స్‌ని చేసే విషయంలో సెలబ్రిటీలు కూడా ముందుంటారు.

తాజాగా ఈ జాబితాలోకి అమెరికా అధ్యక్షుడి భార్య, ఫస్ట్‌ లేడి జిల్‌ బైడెన్‌ కూడా చేరారు. ఎయిర్‌హోస్టెస్‌గా వచ్చి రిపోర్టర్లను, సిబ్బందిని ఏప్రిల్‌ ఫూల్స్‌ చేశారు. కాలీఫోర్నియా పర్యటన ముగించుకుని వస్తుండగా విమానంలో జిల్‌ బైడెన్‌ ఈ ప్రాంక్‌ చేశారు.
 
కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్‌కు విమానంలో తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో.. జిల్ బైడెన్ ఎయిర్‌హోస్టెస్‌లాగా బ్లాక్ డ్రెస్సు ధరించారు. విగ్ ధరించి తన రూపాన్ని మార్చుకుని, బ్లాక్ మాస్క్ పెట్టుకుని చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకున్ని ఆ విమానంలో ఉన్న రిపోర్టర్లు, వైట్‌హౌజ్ సిబ్బంది, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు సర్వ్ చేశారు. జాస్మిన్ అని నేమ్‌ట్యాగ్ పెట్టుకున్న జిల్ బైడెన్‌..ఫ్లయిట్ అటెండెంట్ గా అందర్నీ బోల్తా కొట్టించారు. సిబ్బంది క్యాబిన్లకు వెళ్లి ఐస్‌క్రీమ్ ఇచ్చిన జిల్ బైడెన్‌..ఐదు నిమిషాల తర్వాత ప్రెస్ సెక్షన్‌లో మళ్లీ కనిపించారు.
 
అయితే అక్కడకు వచ్చిన ఆమె..అందరి ముందు తన విగ్‌, మాస్క్‌ తీసేసి చిరునవ్వులు చిందిస్తూ 'ఏప్రిల్‌' ఫూల్‌ అంటూ రిపోర్టర్లను థ్రిల్ చేశారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సిబ్బంది, మీడియా ప్రతినిధులు.. తర్వాత దాని నుంచి తేరుకుని నవ్వుకున్నారు. ఇంతసేపు తమ ముందు ఎయిర్‌హోస్టెస్‌గా తిరిగన వ్యక్తి జిల్ బైడెన్ అని తెలిసి ఆశ్చర్యపోయారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సిబ్బంది, మీడియా ప్రతినిధులు.. తర్వాత దాని నుంచి తేరుకుని నవ్వుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments