Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రాన్స్‌లో కరోనా థర్డ్ వేప్ : ఆస్పత్రులు ఖాళీల్లేవ్...

Advertiesment
ఫ్రాన్స్‌లో కరోనా థర్డ్ వేప్ : ఆస్పత్రులు ఖాళీల్లేవ్...
, శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (14:07 IST)
కరోనా వైరస్ మహమ్మారి మరోమారు విశ్వరూపం దాల్చింది. ఇప్పటికే పలు దేశాల్లో రెండో దశ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లో ధర్డ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో ఈ వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా, ఈ వైరస్ ఊసరవెల్లిని మించిపోయింది. ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటూ కొత్త సవాళ్లు విసురుతోంది.
 
ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే.. భౌతికదూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని వైద్య నిపుణులు పదేపదే చెబుతున్నారు. కానీ, ఏ ఒక్కరూ కరోనా మార్గదర్శకాలను పాటించడం లేదు. దీంతో వైరస్ తీవ్రస్థాయిలో చెలరేగిపోతోంది. 
 
ఈ వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలే వణికిపోతున్నాయి. అమెరికా, ఐరోపా అల్లాడిపోతున్నాయి. ఫ్రాన్స్‌లో థర్డ్‌వేవ్‌ కొనసాగుతోంది. కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుండడంతో.. లాక్‌డౌన్‌ విధించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మూడోసారి లాక్డౌన్‌ విధించక తప్పట్లేదని ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్‌ ప్రకటించారు.
 
కరోనా వైరస్‌ తీవ్రతకు ఫ్రాన్స్‌ విలవిల్లాడిపోతోంది. కోవిడ్ కారణంగా సంభవిస్తున్న మరణాలు లక్షకు చేరువయ్యాయి. కరోనా బాధితులతో అక్కడి ఆసుపత్రులు నిండిపోయాయి. ఎమర్జెన్సీ వార్డుల్లో ఖాళీ ఉండట్లేదు. కొత్త రోగులను ఎక్కడ ఉంచాలో కూడా అర్థంకాక తలపట్టుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి లాక్డౌన్‌ ఒక్కటే మార్గమని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
 
అయితే, లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉన్నా.. ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంతకుమించిన మార్గం కనిపించడం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అంటున్నారు. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకుంటే.. పరిస్థితులు చేజారిపోతాయన్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సమయంలో మళ్లీ లాక్డౌన్‌ విధిస్తే ఎలాగని ఆలోచించారు. 
 
కానీ, కరోనా మహమ్మారి కోరలు చాచడంతో.. మూడోసారి లాక్డౌన్‌ విధించాల్సి వచ్చింది. ఫ్రాన్స్‌లో కొవిడ్‌ కేసులు అరకోటి సమీపించినట్టు అంచనా. కరోనా కేసుల్లో ప్రపంచంలో నాలుగోస్థానంలో ఉంది. టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ వ్యాక్సినేషన్‌ ఏమంత వేగంగా సాగడం లేదు. లాక్డౌన్‌ కారణంగా వ్యాక్సినేషన్ మరింత ఆలస్యం కాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు ఎన్నికలు: ఎడప్పాడి బాగానే చేశారుగా... వేసేద్దాం, ఎవరు?