Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యుడి ప్రతిసృష్టి.. చైనా సిద్ధం.. భారత్‌కు ముప్పు పొంచివున్నట్టేనా?

సూర్యుడి ప్రతిసృష్టి.. చైనా సిద్ధం.. భారత్‌కు ముప్పు పొంచివున్నట్టేనా?
, మంగళవారం, 8 డిశెంబరు 2020 (16:01 IST)
చైనా కృత్రిమ వస్తువుల తయారీలో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా డ్రాగన్ దేశం కొత్త సూర్యుడిని సృష్టించే పనిలో పడింది. సాధారణంగా మన ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు. ఈ విషయంలో చైనా ఒకడుగు ముందుకేసి.. సూర్యుడిని ప్రతిసృష్టి చేసి కొత్త సూర్యుడిని తయారు చేసింది. చైనానే కాదు, మరికొన్ని దేశాలు కూడా కొత్త సూర్యుళ్లను తయారు చేయడంలో బిజీగా ఉన్నాయి. దీంతో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్న మాటకు కాలం చెల్లిపోయినట్టే.
 
దేశీయంగా రూపొందించిన టెక్నాలజీ ఆర్టిఫిషియల్‌ సన్‌ను తయారు చేసినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త భానుడి పేరు హెచ్‌ఎల్‌-2ఎమ్‌ టోకామాక్ రియాక్టర్. అణుశక్తి కోసం దీన్ని తయారు చేశారు. చైనాలో అతి పెద్ద, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగం కోసం ఈ కృత్రిమ సూర్యుడు అవసరమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో అగ్రభాగంలో ఉన్న జపాన్, జర్మనీ, అమెరికా, రష్యాలకు కూడా సాధ్యం కాని పని చైనా చేసి చూపడం గమనార్హం.
 
డ్రాగన్ దేశం తయారు చేసిన కృత్రిమ సూర్యుడిలో శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రం ఉంది. దీనిలో మెటల్ ప్లాస్మాను విచ్చిన్నం చేస్తారు. ఫలితంగా 15 కోట్ల డిగ్రీల సెల్సియస్ శక్తి విడుదల అవుతుంది. ఈ వేడి నింగిలోని అసలు సూర్యుడి మధ్యభాగంలో వెలవడే వేడి కంటే 10 రెట్లు ఎక్కువ. అందుకే దీన్ని కృత్రిమ సూర్యుడిగా వ్యవహరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
 
అసలు సూర్యుడిలోనూ అణువుల విచ్ఛిన్నం వల్లే శక్తి ఏర్పడుతుంది. విచ్ఛిన్నం వల్లే కాంతి ఏర్పడి భూమికి చేరుతుంది. భూమిపై ప్రాణులకు సూర్యుకాంతే ఆధారమన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సూత్రాన్ని అనుసరించి చైనా ప్రభుత్వం నకిలీ సూర్యుడికి పురుడు పోసింది. దీన్ని సిచువాన్ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. కొత్తరకం న్యూక్లియర్ ఫ్యాజన్‌ను తయారు చేస్తున్నట్లు చైనా 2006లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
అయితే అది కాస్తా కృత్రిమ సూర్యుడిగా మారడం ఆసక్తి కలిగిస్తోంది. కృత్రిమ సూర్యుడి ద్వారా వెలువడే అణుశక్తిని చైనా విద్యుత్ కోసం కాకుండా అణ్వాయుధాల కోసం వాడితే భారతదేశానికి కొత్త ముప్పు పొంచి ఉన్నట్లేనని నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Flashback 2020: గాన గాంధర్వుడిని మింగేసిన Covid 19