డ్రగ్స్ కలిపిన బీర్లు తాపించి... ఎయిర్‌హోస్టెస్‌పై పైలట్ల అత్యాచారం

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (09:31 IST)
విశ్రాంతి కోసం బీచ్‌కెళ్లిన ముగ్గురు ఎయిర్‌హోస్టెస్‌పై ఇద్దరు పైలట్లు అత్యాచారం చేశారు. డ్రగ్స్ కలిపిన బీర్లు తాపించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్యూర్టో రికోలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్యూర్టో రికోలో విశ్రాంతి కోసమని ఇద్దరు పైలట్లతో కలిసి ముగ్గురు యువతులు బీచ్‌కు వెళ్లారు. ఆ యువతులకు డ్రగ్స్ కలిపిన బీర్లను తాపించారు. దీంతో వారు మత్తులోకి జారుకున్నారు. 
 
ఆ తర్వాత ఇద్దరు యువతులపై ఇద్దరు పైలట్లు అత్యాచారానికి పాల్పడ్డారు. మరో యువతి మాత్రం వాంతులు చేసుకోవడంతో ఆమెను వదిలిపెట్టారు. వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు తెలిసినా.. తాము ఏం చేయలేని స్థితిలో ఉన్నామని బాధిత మహిళలు ఆవేదన చెందారు. 
 
మరుసటి రోజు పైలట్లతో ఘర్షణకు దిగిన యువతులు వారిపై యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యాజమాన్యం మాత్రం దీన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కలిసి బీచ్‌కు వెళ్లి ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని యువతులను తప్పుబట్టింది. అయినప్పటికీ, తమకు జరిగిన అన్యాయంపై తొమ్మిది నెలలుగా యువతులు పోరాటం చేస్తూనే వచ్చారు. చివరకు వారికి న్యాయం చేసేందుకు విమానయాన సంస్థ హామీ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments