Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్ల జర్నీ.. ఇవాంకా ప్రశంసలు

Webdunia
శనివారం, 23 మే 2020 (11:13 IST)
తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని సుమారు 1200 కిలోమీట‌ర్ల దూరం సైకిల్ తొక్కింది జ్యోతి. ఈ సంఘ‌ట‌న అమెరికా అధ్య‌క్షుడు స‌ల‌హాదారు ఇవాంకా ట్రంప్‌ను ఆక‌ట్టుకుంది. లాక్‌డౌన్ వ‌ల్ల ఉపాధి కోల్పోయి.. స్వంత గ్రామానికి వెళ్లే క్ర‌మంలో జ్యోతి కుమార్ గాయ‌ప‌డ్డ త‌న తండ్రిని సైకిల్‌పై తీసుకెళ్లింది. జ్యోతి ప‌ట్టుద‌ల అంద‌ర్నీ ఆక‌ర్షించింది. ఆమె ప‌ట్టుద‌ల‌కు అంద‌రూ స‌లామ్ కొడుతున్నారు. 
 
ఇవాంకా ట్రంప్ కూడా త‌న మ‌న‌సులో మాట‌ను దాచుకోలేక‌పోయారు. జ్యోతిని ఆమె విశేషంగా కొనియాడారు. జ్యోతి చూపిన అద్భుత‌మైన‌ ఓర్పు, ప్రేమ.. భార‌తీయ ప్ర‌జ‌ల‌ను, సైక్లింగ్ స‌మాఖ్య‌ను క‌ట్ట‌ప‌డేసింద‌ని ఇవాంకా త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.
 
తండ్రిని కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్ల మేరకు సైకిల్ తొక్కుకుని సొంతూరుకు చేరుకున్న బాలికను నెటిజన్లు శభాష్ అంటూ కీర్తిస్తున్నారు. అదేసమయంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. 
 
సైక్లింగ్ ట్రయల్స్‌కు ఆహ్వానించింది. వెనుక ఒకరిని కూర్చోబెట్టుకుని, అంతదూరం ప్రయాణం చేసిన ఆమె శక్తి, సామర్థ్యాలు, తెగువకు ఆశ్చర్యపోయిన సమాఖ్య, గురువారం ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడింది. ట్రయల్స్ కోసం ఢిల్లీకి రావాలని, ట్రయల్స్‌లో సత్తా చాటితే, జాతీయ సైక్లింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తామని సమాఖ్య ఛైర్మన్ ఓంకార్ సింగ్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments