Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమాన ప్రమాదంలో చనిపోలేదు : పాకిస్థాన్ నటి క్లారిటీ

Advertiesment
విమాన ప్రమాదంలో చనిపోలేదు : పాకిస్థాన్ నటి క్లారిటీ
, శుక్రవారం, 22 మే 2020 (22:06 IST)
పాకిస్థాన్ దేశంలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జిన్నా గార్డెన్ సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 91 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతుల్లో పాకిస్థాన్ నటి అయేజా ఖాన్, ఆమె భర్త డానిష్ తైమూర్ కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. 
 
దీనిపై నటి అయేజా ఖాన్ స్పందించారు. విమాన ప్రమాదంలో తాము చనిపోయినట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. తాను బతికే ఉన్నానని తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో తాము లేమని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె స్పందిస్తూ, ఇలాంటి వదంతులను నమ్మొద్దని అభిమానులను కోరింది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయవద్దని మీడియాను కోరింది.
 
కాగా, పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 98 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి కరాచీలో జిన్నా అంతర్జాతీయ విమానశ్రయం వద్ద ఎయిర్‌పోర్టుకు 4 కిలోమీటర్ల సమీపంలో కుప్పకూలిపోయింది. 
 
ఈ ఎయిర్ బస్ ఏ-320 విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో 91 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అయితే, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ విమానం జిన్నా విమానాశ్రయంలో దిగేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి.. విమానాశ్రయం సమీపంలోని జిన్నా గార్డెన్ ఏరియాలోనే కుప్పకూలిపోయింది. 
 
సమాచారం తెలుసుకున్న పాక్ క్విక్ రియాక్షన్ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలకు ఉపక్రమించాయి. కాగా, ఈ విమాన ప్రమాదం జనావాసాల్లో జరగడంతో అనేక గృహాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే, ఈ గృహాల్లోని ప్రజల సంగతి తెలియాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్‌బిఐ రుణాలపై మార‌టోరియం మరో మూడు నెలలు పొడిగింపు: ఒత్తిడికి గురైన మార్కెట్లు