Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (15:09 IST)
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మరోమారు నిప్పుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దళాలు గాజాలోని పలు ప్రాంతాలపై అర్థరాత్రి భీకరమైన దాడులు చేశాయి. ఈ దాడుల్లో నిరాశ్రయులు, తలదాచుకుంటున్న నివాసాలు, శిబిరాలు లక్ష్యంగా మారడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం 66 మంది పాలస్తీనియులు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
ఈ శాఖ లెక్కల ప్రకారం ఖాన్ యూనిస్‌లో 20 మంది, ఉత్తర గాజాలో 36 మంది, జబాలియాలోని శరణార్ధి శిబిరంలో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉండటం గమనార్హం. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ తాజా దాడులపై ఇజ్రాయేల్ సైన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు హమాస్ నిరాకరించడం వల్లే ఈ దాడులను తీవ్రతం చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments