Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాజాలో వైమానికదాడి.. 22 మంది చిన్నారులతో సహా 48 మంది మృతి

Advertiesment
deadbody

ఠాగూర్

, బుధవారం, 14 మే 2025 (15:55 IST)
ఇజ్రాయెల్ - హమాస్‌ మధ్య జరుగుతున్న ఘర్షణలతో గాజా ప్రాంతం మరోసారి దాడులతో దద్ధరిల్లిపోతోంది. ఉత్తర గాజాలోని నివాస ప్రాంతాలపై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఉత్తర గాజాలోని జాబిలియా ప్రాంతంలో ఇళ్లపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 48 మంది పౌరులు మరణించగా వారిలో 22 మంది చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అనేక నివాస భవనాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగా హమాస్ ఒక ఇజ్రాయెల్ అమెరికన్ బందీని విడుదల చేసిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం గమనార్హం 
 
మరోవైపు, గాజాలా యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. దీంతో యుద్ధ విరమణ ఒప్పందంపై నెలకొన్న ఆశలు సన్నగిల్లాయి. ఇటీవల ఇజ్రాయెల్ హుతీలు జరిపిన దాడుల పట్ల నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌‍కు డ్రోన్లతోపాటు సైన్యాన్ని కూడా పంపించిన టర్కీ