హమాస్ ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగివున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో ఒక భారతీయ విద్యార్థిని ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పలు మీడియా సంస్థలు వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి.
బదర్ ఖాన్ సూరీ అనే యువకుడు విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా విద్యాభ్యాసం చేస్తున్నాడు. యూనివర్శిటీలో ఉండే సూరి హమాస్ ఉగ్రసంస్థకు మద్దతుగా ప్రచారం చేయసాగాడు. పైగా, ఆ సంస్థకు చెందిన అనేక మంది ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఫెడరల్ ఏజెంట్లు సోమవారం వర్జీనియాలోని అతడి ఇంటి వెలుపల అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
అయితే, తన అరెస్టుపై సూరి ఇమ్మిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశారు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తన భార్య పాలస్తీనా మూలాలున్న కారణంగానే తనను లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేశారంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాడు.